గొర్రెల కాపరుల సమస్యలపై మెదక్ కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన ఓబీసీ జాతీయ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనకు గొంగడి, గొర్రె పిల్లను బహుకరించారు. ఓబీసీల పట్ల తెరాస ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు.
ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్
ఓబీసీల పట్ల తెరాస ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని ఓబీసీ జాతీయ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గొర్రెల కాపరుల సమస్యలపై మెదక్ కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఆయనకు కాషాయ శ్రేణులు కళ్లకల్ వద్ద ఘనస్వాగతం పలికారు.
ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని ఆరోపించారు. ఓబీసీలకు కల్పించాల్సిన రాజకీయ, సామజిక హక్కులను కాల రాస్తుందని అన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఉపకార వేతనాలు చెల్లించలేదని చెప్పారు. మెదక్ నుంచి భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై శంఖారావం పూరిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి:యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం