రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని... మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో... జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
'నిజాం తరహాలో సీఎం కేసీఆర్ పాలన సాగుతోంది' - మెదక్ జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో నిజాం తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలిస్తున్నారని... మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో... జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
నిజాం తరహాలో సీఎం కేసీఆర్ పాలన సాగుతోంది
భైంసాలో నాలుగు సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసిన నిందితులను... ఇప్పటి వరకు శిక్షించకపోవడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలిస్తున్నారా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్... సీబీఐతో దర్యాప్తు చేయించండి'