తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన భాజపా నాయకుడు రమేష్ గౌడ్ ఇంట్లో శుభకార్యానికి స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ మేరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
'ఉద్యమకారులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డులివ్వాలి' - భాజపా నాయకుడు స్వామిగౌడ్
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చెప్పిన మాటలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని భాజపా నాయకుడు స్వామి గౌడ్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
'ఉద్యమకారులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డులివ్వాలి'
అధికారంలోకి రాగానే కళాకారులకు, ఉద్యమకారులకు, సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా గుర్తింపుకార్డులు ఇవ్వాలని తాను కోరినట్లు స్వామి గౌడ్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి హామీలను అమలు పరచాలని కోరారు.