కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారం వచ్చే అవకాశమే లేదని.. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రజలు కాంగ్రెస్ ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా చేగుండ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ వేరు కాదని.. ఒకే గూటి పక్షులని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా ఒక్కటే అని ఆయన మెదక్ జిల్లా కేంద్రంలో పేర్కొన్నారు.
దుబ్బాక ఎన్నికల్లో భాజపాదే విజయం: లక్ష్మణ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ భాజపా తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రజల మన్ననలు పొంది దుబ్బాక ఉపఎన్నికల్లో కమలం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక ఎన్నికల్లో భాజపాదే విజయం: లక్ష్మణ్
తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు అవలంబించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో హరీశ్‌రావు అవలంబిస్తున్నారన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని.. ప్రజల మన్ననలు పొంది గెలుపొందామని దుబ్బాక ఉపఎన్నికలతో పాటు 2023 ఎన్నికల్లోనూ రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి