మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో కరోనా బాధితులకు భాజపా నేతలు హోం ఐసోలేషన్ కిట్లు అందజేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి రఘునందన్ రావు ఆదేశాలమేరకు కిట్లు ఇచ్చినట్లు తెలిపారు.
భాజపా ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ - మెదక్ జిల్లా వార్తలు
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో కరోనా బాధితులకు భాజపా నేతలు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
bjp
ఈ కార్యక్రమంలో చేగుంట భాజపా మండల అధ్యక్షలు చింతల భూపాల్, పట్టణ అధ్యక్షుడు సాయిరాజ్, దుబ్బాక సోషల్ మీడియా కన్వీనర్ ఆంజనేయులు,యువ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రమౌళి, గోవింద్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.