ఉద్యోగుల సమస్యలపై భాజపా నిరంతరం పోరాడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ వెంటనే అమలు చేయాలని మెదక్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం : రఘునందన్‌రావు - పీఆర్సీ, ఐఆర్ వెంటనే అమలు చేయాలంటూ భాజపా ధర్నా
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్ విషయంలో భాజపా పోరాటం కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు భాజపా శ్రేణులు చేపట్టిన ధర్నా వద్దకు చేరుకుని కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై భాజపా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం సన్నవరి ధాన్యంపై బంద్‌కు పిలుపునిస్తే ఉద్యోగ సంఘాలు పాల్గొనడం బాధాకరమైన విషయమన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే వారికి భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.