తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా గెలుపు... తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు - Medak latest news

మెదక్​ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం తెరాస ప్రభుత్వానికి, కేసీఆర్​కు చెంపపెట్టులాంటిదని.. జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ అన్నారు.

BJP celebrate in Medak district center
భాజపా గెలుపు... తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు

By

Published : Nov 10, 2020, 6:25 PM IST

Updated : Nov 10, 2020, 6:39 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు విజయం సాధించారు. దీనితో మెదక్​ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ విజయం తెరాస ప్రభుత్వానికి, కేసీఆర్​కు చెంపపెట్టులాంటిదని.. జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ అన్నారు. అధికార దుర్వినియోగం చేసి.. డబ్బు మద్యం పంపిణీ చేసినప్పిటికీ... దుబ్బాక ప్రజలు తెరాసను తిప్పికొట్టారని వెల్లడించారు.

భాజపా గెలుపు... తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు

ఈ గెలుపు దేశానికి ఘన విజయమని పేర్కొన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్​ ఎన్నికలు, 2023 ఎన్నికల్లో భాజపాకు ఈ ఫలితం నాంది కానుందని వివరించారు. ఇకనైనా తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచి... పటాకులు కాల్చారు.

భాజపా గెలుపు... తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు
  • ఇదీ చదవండి: విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు
Last Updated : Nov 10, 2020, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details