మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న చెట్టు కొమ్మలకు రంగురంగుల తొట్టెలు వేలాడుతూ కనిపిస్తాయి. అవేవో అలంకరణకోసం అనుకుంటే పొరపాటే. పక్షుల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు.
బాధ్యతగా ముందుకొచ్చి
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన స్వచ్ఛభారత్ సభ్యులు. వేసవిలో పక్షులు పడుతున్న బాధలను చూసి ఏదైనా చేయాలనుకున్నారు. దాతల సహకారంతో రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల మేర నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.