తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలకు ప్రత్యేకమైనది బతుకమ్మ పండగ - జడ్పీ ఛైర్​పర్సన్ హేమలత గౌడ్

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో జడ్పీ ఛైర్​పర్సన్ హేమలత గౌడ్ పాల్గొన్నారు.

జడ్పీ ఛైర్​పర్సన్ హేమలత గౌడ్

By

Published : Sep 27, 2019, 5:58 PM IST

తెలంగాణలో బతుకమ్మ పండగను మహిళలు ప్రత్యేకంగా జరుపుకుంటారని మెదక్ జడ్పీ ఛైర్​పర్సన్ హేమలత గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లతో కలిసి బతుకమ్మ కోలాటాలు ఆడారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మెరిసిపోయారు. బతుకమ్మ పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

బతుకమ్మ పండగ

ABOUT THE AUTHOR

...view details