ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఈ పండుగ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లిలో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చీరలను అందిస్తోందని పద్మ అన్నారు.