మెదక్ జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిదిరోజుల పాటు రోజూ.. అందమైన రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలాడిన మహిళలు చివరిరోజైన సద్దుల బతుకమ్మ నాడు.. బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా చెరువుల్లో నిమజ్జనం చేశారు.
మెదక్‌లో బతుకమ్మ సంబరాలు.. ఆడిపాడిన ఆడపడుచులు
తెలంగాణలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సద్దుల బతుకమ్మను మెదక్ జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఊరి చెరువులో నిమజ్జనం చేశారు.
మెదక్‌లో బతుకమ్మ సంబరాలు.. ఆడిపాడిన ఆడపడుచులు
మెదక్ జిల్లాకేంద్రంలోని బాలాజీ మఠం ,ఫతేనగర్, నవాబ్‌పేట, వాసవి నగర్ తదితర కాలనీల్లో మహిళలు బతుకమ్మపు పేర్చి ఆడిపాడారు. నిమజ్జనం అనంతరం పరస్ఫరం వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
ఇదీ చదవండి: విపత్తుల కల్లోలం.. పర్యావరణ పరిరక్షణ అత్యావశ్యకం