తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: కేసీఆర్ గడీల పాలన అంతం.. భాజపాతోనే సాధ్యం - telangana varthalu

కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఏడేళ్ల తెరాస పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లా జోగిపేట బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

BANDI SANJAYl: 'కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానే'
BANDI SANJAYl: 'కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానే'

By

Published : Sep 11, 2021, 4:42 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జోగిపేటకు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​పై బండి సంజయ్​ విరుచుకుపడ్డారు. భాజపా, తెరాసలు ఒక్కటి కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలొస్తే సీఎం కేసీఆర్​ దిల్లీ వెళ్తారని ఆరోపించారు. 2023లో గొల్లకొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమన్నారు. ఏడేళ్ల తెరాస పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని త్వరలో రాష్ట్రం చూడబోతుందని జోస్యం చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లా జోగిపేట బహిరంగసభలో భాజపా జాతీయ కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గీస్‌, మాజీ మంత్రి ఈటలతో కలిసి బండి సంజయ్​ పాల్గొన్నారు.

కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానే. భాజపా, తెరాస ఒక్కటైతే దుబ్బాకలో భాజపా ఎట్ల గెలుస్తది. జీహెచ్​ఎంసీ బీజేపీ ఎట్ల గెలుస్తది. గొల్లకురుమల కొండ.. గొల్లకొండ మీద కాషాయ జెండాను రెపరెపలాడించి.. అధికారంలోకి వచ్చే పార్టీ భాజపానే. కేసీఆర్​ అవినీతి పాలన సంగతేందో చూస్తాం. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

BANDI SANJAYl: 'కేసీఆర్​ గడీల పాలనను అంతమొందించే పార్టీ భాజపానే'

ఇదీ చదవండి: Harish Rao: భాజపాకు ఓటెందుకెయ్యాలి.. పెట్రోల్, గ్యాస్ ధర​లు పెంచినందుకా?

ABOUT THE AUTHOR

...view details