తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్ లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు - Narsapur bribery case news

నర్సాపూర్ లంచం కేసులో నిందితులు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేశారు.

నర్సాపూర్ లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు
నర్సాపూర్ లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు

By

Published : Oct 8, 2020, 11:31 PM IST

నర్సాపూర్ లంచం కేసులో నిందితులు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేశారు. ఇదివరకు వేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.

కేసులో సాక్ష్యాలు సేకరించాల్సి ఉన్నందున నిందితులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని అనిశా తరఫు న్యాయవాది వాదించగా... ఈనెల 1న అనిశా న్యాయస్థానం బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తైనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై న్యాయస్థానంలో మంగళవారం వాదనలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: గంగుల

ABOUT THE AUTHOR

...view details