సీజనల్ వ్యాధులు, కొవిడ్-19పై మెదక్ జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు కలెక్టరేట్ ప్రజావాణి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, బాధితులను ఏ విధంగా గుర్తించాలో ఈ అవగాహన సదస్సులో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వివరించారు. వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు సీజనల్ వ్యాధుల గుర్తింపునకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సహకరించాలని కోరారు.
ఆర్ఎంపీ, పీఎంపీలకు సీజనల్ వ్యాధులు, కరోనాపై అవగాహన సదస్సు - seasonal Diseases news
మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధులు, కరోనాపై పలు అంశాలు చర్చించారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల గుర్తింపునకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సహకరించాలని కోరారు.

తమ వద్దకు వచ్చిన బాధితులకు కరోనా లక్షణాలు ఉంటే పరిసర ప్రాంత వైద్య అధికారుల దృష్టికి తీసుకురావటమే కాకుండా.. ఆయా ఆస్పత్రులకు వెళ్లేలా సూచనలు చేయాలని తెలిపారు. కొవిడ్‌కు సంబంధించి ఏ చికిత్సలు అందించొద్దని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు తమ వద్దకు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని తెలియజేశారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున... అలాంటి లక్షణాలు ఉన్న వారి వివరాలు సంబంధిత వైద్యులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డాక్టర్ శివ కిరణ్, జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.