మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కరోనా కేసులు అన్ని మండలాల్లో నమోదు అవుతున్నాయి. తాజాగా చిలప్‌చెడ్ మండలం ఫైజాబాద్‌లో వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించారు. మండల వైద్యాధికారి వెంకట్, ఎస్సై మల్లారెడ్డి, తహసీల్దార్ సత్తార్.. గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కరోనా వచ్చిన వ్యక్తి కలిసిన 20 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచారు.
ఫైజాబాద్‌లో కరోనాపై అధికారుల అవగాహన - మెదక్ జిల్లా తాజా వార్తలు
మెదక్ జిల్లా ఫైజాబాద్‌లో తాజాగా కరోనా సోకిన వ్యక్తిని అధికారులు గుర్తించారు. బాధిత వ్యక్తిని కలిసిన 20 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. గ్రామం మొత్తం రసాయనాలు పిచికారీ చేయించి.. మహమ్మారిపై అవగాహన కల్పించారు. వ్యాధి వచ్చిందని ఆందోళన చెందొద్దని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫైజాబాద్‌లో కరోనాపై అధికారుల అవగాహన
గ్రామం మొత్తం రసాయనాలను పిచికారి చేయించారు. వ్యాధి వచ్చిందని ఆందోళన చెందొద్దని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థులు భౌతికదూరం పాటించాలని చెప్పారు. అనంతరం ఫైజాబాద్, బండపోతుగల్ గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎక్కువ మందితో విందులు చేసుకోవద్దని కోరారు. వ్యాధి రాకుండా స్వీయ జాగ్రత్తనే ప్రధానమని తెలిపారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?