బాల్య వివాహాలపై ప్రభుత్వ అధికారులు ఎంత అవగాహన కల్పించిన ఇంకా కొంతమంది ప్రజల్లో మార్పు రావడం లేదు. పెళ్లి చేసుకునే వయసు రాకపోయిన ఆడ పిల్లలకు వివాహాలు చేస్తూనే ఉన్నారు. మైనర్ బాలికలకు వివాహాల పట్ల అవగాహన లేకున్నా ఇవేమి వారికి పట్టడం లేదు. బాల్య వివాహాలు వద్దన్న అధికారులపైకి దాడులు తెగబడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల ముందు బాల్య వివాహలు చేయకుండా ఉండటం... మళ్లీ కొద్దిరోజులకే పెళ్లి చేయడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది.
మెదక్ జిల్లా ఐసీడీఎస్ (ICDS) అధికారులపై దాడియత్నం జరిగింది. చీలప్‌చెడులో బాల్య వివాహం జరిగిందని అధికారులకు సమాచారం అందింది. రెండు రోజుల కిందటే మైనర్‌లకు పెళ్లి చేయడం నేరమని చెచ్చజెప్పారు. కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అయినా వివాహం జరిపించారు.