మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. వ్యవసాయమే ప్రధాన ఆధారమన్నారు. గతంలో వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండేవని... మోదీ ప్రధాని అయ్యాక విద్యుత్ రంగంలో విశేషమైన మార్పు వచ్చిందన్నారు.
వన్ నేషన్-వన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పంచామని పేర్కొన్నారు. రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు. కిసాన్ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వచ్చే నెలలో ఎరువుల పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని ప్రకటించారు.