మద్యపానం నిషేధిస్తూ మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామ ప్రజలు ఐక్యతను చాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ లచ్చయ్య ఆధ్వర్యంలో మద్యం తమ గ్రామాన్ని చిధ్రం చేస్తోందని... మహమ్మారిని తరిమికొట్టాలని నడుం బిగించారు.
ఆ గ్రామంలో మద్యం అంటే ఛీ... ఛీ... - Alcohol Banned in Medak district naini jalaalpur village
సాయంత్రం అయ్యిందంటేచాలు కిటకిటలాడే బెల్ట్‌షాపులు.. వీధుల్లో తూలుతూ నడిచే తాగుబోతులు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనిపించే దృశ్యాలే. ఈ తరుణంలో నాయిని జలాల్ పూర్ గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో మద్యం నిషేధించాలని తీర్మానించారు.
ఆ గ్రామంలో మద్యం అంటే ఛీ... ఛీ...
మద్యం అమ్మకాలకు స్వస్తి చెప్పాలని... ఎవరు తాగకూడదని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ప్రతిజ్ఞ చేశారు. ఎవరు మద్యం అమ్మిన... కొన్నా 50 వేల వరకు జరిమానా విధిస్తామని సర్పంచ్ తెలిపారు. కిరాణా దుకాణదారులకు సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నోటీసులు అందజేశారు.