తెలంగాణ

telangana

ETV Bharat / state

వనదుర్గా భవానిమాతను దర్శించుకున్న అదనపు కలెక్టర్ - medak additional collector visit edupayala

ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అంతకు ముందు మెదక్ చర్చిని సందర్శించిన ఆయన చర్చి విశిష్టతను గురించి పాస్టర్లను అడిగి తెలుసుకున్నారు.

medak additional collector visit edupayala
వనదుర్గా భవని ఆలయాన్ని సందర్శించిన మెదక్ అదనపు కలెక్టర్

By

Published : Apr 5, 2021, 5:20 PM IST

ఏడుపాయల వనదుర్గా భవానిమాత ఆలయాన్ని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి. రమేశ్​ సందర్శించారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేశ్​ జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.

అంతకు ముందు మెదక్ చర్చిని సందర్శించిన అదనపు కలెక్టర్ జి. రమేశ్​ ఏసు చరిత్రను, చర్చి ఔన్నత్యాన్ని గురించి పాస్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద చర్చిగా నిలవడం దేశానికే గర్వకారణమని అన్నారు.

ఇదీ చదవండి:నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details