తెలంగాణ

telangana

ETV Bharat / state

'కలెక్టరేట్​ పనులను త్వరితగతిన పూర్తి చేయండి' - మెదక్​ జిల్లాలో పర్యటించిన అదనపు కలెక్టర్​ నగేశ్​

మెదక్​ జిల్లాలో అదనపు కలెక్టర్​ నగేశ్​ పర్యటించారు. పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ సముదాయ పనులను ఆకస్మికంగా పరిశీలించారు.

Breaking News

By

Published : Aug 7, 2020, 7:52 PM IST

మెదక్​ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ పనులను త్వరితగతిన పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్​ నగేశ్ ఆదేశించారు. ​ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ సముదాయ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. రామాయంపేట మున్సిపాలిటీలో రెండు ఎకరాలలో అర్బన్​ పార్కు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రామాయంపేటలో పర్యటించిన అదనపు కలెక్టర్​.. పట్టు పరిశ్రమ స్థలంలో రెండు ఎకరాల్లో పట్టణ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details