తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా దృష్ట్యా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి: కలెక్టర్​ - మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ సమీక్ష

మెదక్​ జిల్లాలో కరోనా కేసులు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్​ నగేష్​ అన్నారు. వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

additional collector nagesh review meeting with doctors and amns in medak district
కరోనా దృష్ట్యా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి: కలెక్టర్​

By

Published : Aug 5, 2020, 7:27 PM IST

కొవిడ్​ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్​ నగేశ్​ అదేశించారు. జిల్లాలోని పీహెచ్​సీ డాక్టర్లు, ఏఎన్​ఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వివిధ గ్రామాల్లో నమోదైన కేసులు, వారిపట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు.

ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచడం, పరీక్షల కోసం వచ్చే రోగులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. వైరస్​తో మరణించినవారి మృతదేహాలను గ్రామాల్లోకి తీసుకొచ్చేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details