మెదక్ మున్సిపాలటీలో నీటి సమస్య కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. నీటి ఎద్దడిపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. 12 ట్యాంకర్ల ద్వారా పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని జూన్ 11న నిలిపివేశారని తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు పట్టణ శివారులో 4 వ్యవసాయ బోర్లను లీజ్‌కు తీసుకున్నామని చెప్పారు.
నీటి సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు - water
నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని మెదక్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు లేక నీటికి ఇబ్బందవుతుందన్నారు.

మెదక్ మున్సిపల్ కార్యాలయం
నీటి సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు
ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'