మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పులి.. కుక్కపై దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. గణ్యతండా సమీపంలో ఓ లేగదూడపై దాడి చేయగా.. త్రుటిలో తప్పించుకుని వచ్చిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో కొండగొర్రెను చంపి తిన్న ఆనవాళ్లున్నాయని వెల్లడించారు.
అచ్చంపేటలో పులి సంచారం.. భయాందోళనలో జనం - tiger wanders in narsapur mandal forest area
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బయటకు వెళ్లాలంటేనే భయంతో ఆ గ్రామస్థులు వణికిపోతున్నారు.

Breaking News
రాత్రి సమయంలో పులి గాండ్రింపు వినిపిస్తోందని గ్రామస్థులు తెలిపారు. బయటకు వెళ్లాలంటేనే వణుకు పుడుతోందని, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.