మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ వైపు వెళ్తున్న ఓ టాటాఏస్ వాహనం అతివేగంతో పెద్ద చింతకుంట వద్ద నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్.. ఇద్దరు మృతి - latest news on accident at pedda chintha kunta two people died
అతి వేగంతో ఓ టాటాఏస్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
![ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్.. ఇద్దరు మృతి accident at pedda chintha kunta two people died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5509354-825-5509354-1577437585903.jpg)
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్.. ఇద్దరు మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన వాహనం దిగి క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్.. ఇద్దరు మృతి
ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!