టీఆర్టీ నియామకాలు పూర్తి చేయడం వల్ల మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లో విద్యావాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్వాసన పలకాల్సి వచ్చింది. వారంతా రోడ్డున పడ్డామని తమకేదైనా ప్రత్యామ్నామం చూపమంటూ విద్యావాలంటీర్లంతా జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందించారు. పెండింగ్ వేతనాలు ఇప్పించమని విజ్ఞప్తి చేశారు.
టీఆర్టీల నియామకంతో రోడ్డున పడ్డ విద్యావాలంటీర్లు - medak
2017 టీఆర్టీలో నియామకాల్లో భాగంగా మెదక్ జిల్లాలో భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు 208 ఖాళీలు భర్తీ చేశారు. టీఆర్టీ అభ్యర్థుల చేరికతో ఇప్పటి వరకు విద్యావాలంటీర్లుగా పనిచేస్తున్న వారిని తొలగించారు.
టీఆర్టీల నియామకంతో రోడ్డున పడ్డ విద్యావాలంటీర్లు
ఇదీ చూడండి: 'వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది'