మెదక్ జిల్లా కొత్తపేట గ్రామంలో శేఖర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూ వివాదంలో శివ్వంపేట ఎస్సై వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. వాటిని తట్టుకోలేక పురుగుల మందు తాగానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎస్సై వేధిస్తున్నాడని యువకుడు ఆత్మహత్యాయత్నం - Telangana Latest News
మెదక్ జిల్లా కొత్తపేటలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూ వివాదంలో ఎస్సై వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.

ఎస్సై వేధిస్తున్నాడని యువకుడు ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి యువకుడిని తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఫీవర్ ఆస్పత్రిలో భీమడోలు వాసి ఆత్మహత్య