తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి ప్రభావం.. ట్యాంకర్​తో పొలానికి నీరు పెడుతున్న రైతు! - తెలంగాణ వార్తలు

వానా కాలంలో వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయని రైతులు సంతోషపడ్డారు. యాసంగికి ఢోకా లేదని వరి నాట్లు వేశారు. కానీ వేసవి సమీపించడంతో ఆరుగాలం కష్టపడిన పంటకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఎలాగైనా పంటను కాపాడుకోవడానికి పొలానికి ట్యాంకర్​తో నీటిని పెడుతున్నారు ఓ రైతు.

water to crop with tankerm medak district news
ట్యాంకర్​తో పొలానికి నీరు, మెదక్ జిల్లా రైతు

By

Published : Apr 5, 2021, 1:53 PM IST

ఎండలు తీవ్రం కావడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు ఎండిపోతుండగా చేతికొచ్చిన పంటలు కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కాశీపూర్ తండాకు చెందిన రామచంద్రం బోరు బావి కింద వరి సాగు చేశారు. పంట పొట్టదశకు వచ్చింది. మరో నెలరోజుల్లో చేతికి వస్తుంది. ఈ తరుణంలో బోరు వట్టిపోయి నీళ్లు అందిచలేని పరిస్థితి నెలకొంది.

ఎలాగైనా పంటను కాపాడుకోవాలని ఆ రైతు శ్రమిస్తున్నారు. రూ.6వేలు చెల్లించి ఓ ట్యాంకర్ అద్దెకు తీసుకొని.. నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న జడ్​ చెరువు తండా నుంచి నీళ్లను తరలిస్తున్నారు. చివరి వరకు నీళ్లు అందించగలనో లేదో అనే అనుమానాల మధ్య తలకు మించి ఖర్చు చేస్తున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేసవి ప్రభావం.. ట్యాంకర్​తో పొలానికి నీరు పెడుతున్న రైతు!

ఇదీ చదవండి:'హైదరాబాద్​ను సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు చర్యలు'

ABOUT THE AUTHOR

...view details