మెదక్ మండలం పాతూర్ గ్రామంలో కుంటి నాగరాజు అనే రైతు ఎకరం విస్తీర్ణంలో సన్న రకం వరి సాగు చేశాడు. పంట బాగానే ఎదిగినప్పటికీ.. చేతికొచ్చే సమయంలో దోమపోటు సోకింది. క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.
దోమపోటు సోకిందని పంటకు నిప్పు పెట్టిన రైతన్న - medak district latest news
సర్కారు చెప్పిందని సన్న రకం వరి పంట సాగు చేస్తే.. తెగుళ్లు ఆశించి పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి డబ్బులు సైతం చేతికందే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రైతు.. తన చేతులతోనే పంటకు నిప్పంటించాడు.
A farmer set fire to a crop infected with mosquitoes
ఈ క్రమంలోనే పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదని మనస్తాపానికి గురైన నాగరాజు.. స్వయంగా తన చేతులతోనే పంటకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే పంటంతా కాలి బూడిదైంది. ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేయించడం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతు వాపోయాడు. దోమపోటుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి.. ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఇదీ చదంవడి:బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు