ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్లో జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని చదివి వినిపించారు.
'ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు' - తెలంగాణలో గణతంత్ర వేడుకలు
మెదక్ కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మెదక్ కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు
వ్యవసాయరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోదని ఆర్డీవో సాయిరాం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి, జడ్పీ ఛైర్పర్సన్ రేకల హేమలత శేఖర్ గౌడ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం