కస్తూర్బా పాఠశాలలో కొవిడ్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్ - మెదక్ జిల్లా లేటెస్ట్ వార్తలు

17:26 March 01
కస్తూర్బా పాఠశాలలో కొవిడ్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్
మెదక్ జిల్లా ఝరాసంగం కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం రేగింది. కస్తూర్బా పాఠశాలలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. ఇందులో ఆరుగురు విద్యార్థినిలు కాగా, ఒక ఆయా ఉన్నారు. వీరికి ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. కాని ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలింది.
కస్తూర్బా పాఠశాలలో ఇప్పటివరకు 19 మందికి కరోనా సోకింది. హోంక్వారంటైన్‌లో ఉన్న బాధితుల్లో ముగ్గురిలోనే కరోనా లక్షణాలు ఉన్నాయి. బాలికలకు కొవిడ్ పాజిటివ్ రావటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:ప్రతీ సాక్ష్యం కీలకమే.. వాటిని భద్రపరచండి: హైకోర్టు