తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ సహకార సంఘాలకు 46 నామినేషన్లు - PACS ELECTIONS UPADATES

మెదక్​ ప్రాథమిక సహకార సంఘానికి మూడు రోజుల్లో 46 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరిరోజు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసినట్లు తెలిపారు.

46 NOMINATIONS FILED FOR MEDAK PACS ELECTIONS
46 NOMINATIONS FILED FOR MEDAK PACS ELECTIONS

By

Published : Feb 8, 2020, 7:42 PM IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మెదక్ ప్రాథమిక సహకార సంఘానికి 13 బ్లాక్​లకు గాను 3 రోజులలో మొత్తం 46 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి రాంబాబు వెల్లడించారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కాగా... అధిక సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు.

అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారులతో సహకార సంఘాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుందని 10న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండగా... 15న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి రాంబాబు వివరించారు.

మెదక్​ సహకార సంఘాలకు 46 నామినేషన్లు

ఇదీ చూడండి:ఎఫ్​డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!

ABOUT THE AUTHOR

...view details