తెలంగాణ

telangana

ETV Bharat / state

రంజాన్ స్పెషల్: జిల్లాకు 4వేల గిఫ్ట్ ప్యాకెట్లు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాల కోసం జిల్లాకు 4వేల గిఫ్ట్ ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ తెలిపారు. ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మే 4లోగా అర్హులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

gift packets for Muslims, medak district gift packets
రంజాన్ గిఫ్ట్ ప్యాక్​లు, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్

By

Published : Apr 24, 2021, 7:18 PM IST

రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు నాలుగు వేల గిఫ్ట్ ప్యాకెట్లను అందించనున్నామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ తెలిపారు. ఒక్కో ప్యాకెట్​లో కుర్తా, పైజామా, చీర, జాకెట్టు, చుడిదార్ ఉంటాయని అన్నారు. బహుమతుల పంపిణీపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెదక్ నియోజకవర్గానికి 2500, నర్సాపూర్ నియోజకవర్గానికి 1500 గిఫ్ట్ ప్యాకెట్లను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సంచాలకులు పంపించారని ఆయన తెలిపారు. ప్రతి పేద ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో జిల్లాకు 4000 గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేసిందని ఆయన తెలిపారు. మే 4లోగా అర్హులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్​లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

ABOUT THE AUTHOR

...view details