తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు... - దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

సరదాగా దసరా పండుగ సెలవులు అమ్మమ్మ ఇంట్లో గడుపుదామని వచ్చిన వారిద్దరూ... ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు.

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

By

Published : Sep 30, 2019, 8:15 PM IST

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్​లో విషాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన ప్రశాంత్, గుండ్లపల్లికి చెందిన పావని దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన ఘనపూర్​కు వచ్చారు. ప్రశాంత్, పావని వరుసకు అన్నాచెల్లెల్లు. వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో గల నరసింహ స్వామి గుట్ట వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. పిల్లలందరూ జారుడు బండపై ఆడుకుంటుండగా... ప్రమాదవశాత్తు ప్రశాంత్ పక్కనే ఉన్న కుంటలో పడిపోయాడు. వెంటనే పావని అన్నని రక్షించేందుకు కుంటలోకి దూకింది. ఇద్దరూ మునిగిపోవడం గమనించిన పిల్లలు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ అప్పటికే చనిపోగా... పావని చికిత్స పొందతూ తూప్రాన్​ ప్రభుత్వాసుపత్రిలో మరణించింది.

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

ABOUT THE AUTHOR

...view details