మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి విందుకు 30 మందితో కామారెడ్డి జిల్లాలోని బాగీర్తిపల్లి నుంచి మల్కాపూర్‌కు బయలుదేరిన వ్యాను జప్తిశివనూర్ వద్ద బోల్తాపడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నార్సింగి ఎస్ఐ రాజేశ్ తెలిపారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.
పెళ్లి వ్యాను బోల్తా... 15 మందికి తీవ్రగాయాలు - medak-district news
మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్ వద్ద పెళ్లి విందుకు 30మందితో వెళ్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పెళ్లి వ్యాను బోల్తా... 15 మందికి తీవ్రగాయాలు
ప్రాథమిక చికిత్స కోసం బాధితులని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 10 మందిని హైదరాబాద్ సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజేశ్ తెలిపారు.
ఇవీ చూడండి: పేలుడు పదార్థాలు తరలిస్తున్న మావోయిస్టు కొరియర్ అరెస్ట్