ప్రస్తుతం అనవసరమైన ఆలోచనలతో దిగులు చెందుతూ ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సీనియర్ మాస్టర్ వేణు గోపాల్ తెలిపారు. అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో పిరమిడ్ సైన్స్ వన్డే వర్క్ షాప్‌ను నిర్వహించారు. మెడిటేషన్ అనే అంశంపై ఉచిత శిక్షణ ఇచ్చారు.
'ధ్యానం మానసిక ఒత్తిళ్లను జయించే సర్వరోగ నివారిణి!' - తెలంగాణ వార్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో పిరమిడ్ సైన్స్ వన్డే వర్క్ షాప్ నిర్వహించారు. మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిళ్లను జయించే సర్వరోగ నివారిణి ధ్యానం అని అన్నారు.

'ధ్యానం మానసిక ఒత్తిళ్లను జయించే సర్వరోగనివారిణి!'
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని.. మానసిక ఒత్తిళ్లను జయించే సర్వరోగనివారిణి అని అన్నారు. మూఢ నమ్మకాలకు అతీతంగా పూర్తిగా సైన్స్‌తో సంబంధం ఉందని అన్నారు.
ఇదీ చదవండి:సౌరవిద్యుత్ ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం: జగదీశ్‌రెడ్డి