తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంపూర్ ఏరియా ఆర్​.కె 6 గనిలో పనులు ప్రారంభం

శ్రీరాంపూర్ ఏరియా ఆర్.కె 6 గనిలో పనులు ప్రారంభమయ్యాయి. బొగ్గు బావులు లే ఆఫ్ ఎత్తివేయడంతో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. మాస్కులు ధరించి, దూరం పాటించాలని అధికారులు సూచించారు.

By

Published : May 21, 2020, 12:02 PM IST

work-started-in-singareni-mines
శ్రీరాంపూర్ ఏరియా ఆర్​.కె 6 గనిలో పనులు ప్రారంభం

సింగరేణిలో లే ఆఫ్‌తో మూతబడిన భూగర్భ గనులు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. యాజమాన్యం లే ఆఫ్‌ ప్రకటించడంతో సుమారు 50రోజులుగా గనుల్లో నిలిచిపోయిన... బొగ్గు ఉత్పత్తి పనులు తిరిగి మొదలయ్యాయి. బొగ్గు బావులు లే ఆఫ్‌ ఎత్తివేయడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్​.కె 6 గనిలో విధుల్లో చేరిన కార్మికులు... మాస్కులు ధరించి, దూరం నిబంధనలు పాటిస్తూ పనిచేస్తున్నారు. ఇవాళ మొదటి షిఫ్టు భూగర్భ గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైంది.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గు గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. లే ఆఫ్‌ ప్రకటనతో ఏప్రిల్‌ 1 నుంచి ఇళ్లకే పరిమితమైన కార్మికులు, ఉద్యోగులు తిరిగి విధులకు హాజరుకావడంతో.... గనుల్లో సందడి వాతావరణ నెలకొంది. అటు మొదటి షిఫ్టుకు హాజరైన కార్మికులతో అధికారులు కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించారు. గనులకు వచ్చే ముందు, తిరిగి ఇంటికి వెళ్లే ముందు కూడా శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకొని మాస్కు ధరించి వెళ్లాలని సూచించారు.

ఇవీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details