ఈత రాకున్నా... ప్రాణాలకు తెగించి ధైర్య సాహసంతో ఓ మహిళ ప్రాణాలు రక్షించాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోచమ్మ చెరువులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. మహిళ చెరువులోకి దూకే సమయంలో అక్కడే ఉన్న మురళి ఏమి ఆలోచించకుండా చెరువులో దూకాడు. మురళికి ఈత రాదు. బయటే ఉన్న మరో వ్యక్తి అతనికి టవల్ అందించాడు. టవల్ను పట్టుకుని మహిళను కాపాడాడు. ఈత రాకున్నా... మహిళ ప్రాణాలు కాపాడిన మురళిని పలువురు అభినందించారు. అయితే మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
పరిమళించిన మానవత్వం... మురళి తీరు అభినందనీయం - manchiryala district latest news
ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయింది. దానిని చూసిన ఓ వ్యక్తి ఆమెను ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోచమ్మ చెరువులో చోటుచేసుకుంది.
![పరిమళించిన మానవత్వం... మురళి తీరు అభినందనీయం woman was a man who saved lives at manchiryala district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7446312-229-7446312-1591098410156.jpg)
ఈత రాకున్నా... ప్రాణాలకు తెగించి..