మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక పరిధిలోని గోదావరిరోడ్డులో ఓ మహిళ కరోనా బారిన పడింది. కుటుంబసభ్యులు తమకు వైరస్ సోకకూడదని... ఇంట్లో నాలుగు గదులు ఉన్నా... ఆమెను స్నానాల గదికి పరిమితం చేశారు. ఆరు రోజులుగా ఆమె పడుతున్న ఇబ్బందులను గమనించిన పొరుగువాళ్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు.
Corona Effect: కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్.. - బాత్రూంలో క్వారంటైన్
కరోనా మనుషుల మధ్య ప్రేమానూరాగాలను దూరం చేస్తోంది. ఇంట్లో నాలుగు గదులు ఉన్నా... మిగిలిన వారికి కరోనా సోకుతుందనే భయంతో ఆ ఇంటి సభ్యులు ఆమెను స్నానాల గదికి పరిమితం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Corona Effect: ఇంట్లో నాలుగు గదులున్నా... కరోనా భయంతో
స్పందించిన ఎస్సై బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే బెల్లంపల్లిలోని కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని సూచించారు. బాధితురాలు అంగీకరించకపోవడంతో... ఇంట్లోని ఓ గది ఖాళీ చేయించి అందులో ఆమెకు ఉండేందుకు ఏర్పాట్లు చేయించారు.
ఇదీ చూడండి:బాలికపై అత్యాచారం- డీఎస్పీపై ఎఫ్ఐఆర్