Woman Loses RS 7 Lakhs Online App Fraud in Hanumakonda : ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు(Online Fraud) ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయే వరకు ఎన్నో ఆన్లైన్ ప్రాండ్లను చూస్తున్నాము. అలాగే ఉద్యోగాల పేరుతో అమాయకమైన వారిని అక్రమార్కులు నిండా ముంచుతున్నారు. అయితే తాజాగా హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో ఈ తరహా ఘటనలే జరిగాయి.
మహిళను నమ్మించి ఆన్లైన్ యాప్(Online App) ద్వారా రూ.7.50 లక్షల నగదును హైదరాబాద్‌కు చెందిన యువకుడు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ గాంధీనగర్‌కు చెందిన మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బ్యాంక్ ఖాతాలో కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకుంటుంది. ఈ క్రమంలో 'నీతో' యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన వసంత్ పరిచయం అయ్యాడు.
Online Fraud : ఇలా వారివురు వాట్సప్ ఛాటింగ్(Whats App) చేసుకుంటు ఉన్నారు. తనకు ఎవరూ లేరని ఒంటరిగా ఉంటున్నానని ఆమెను వసంత్ నమ్మించసాగాడు. అదే విధంగా తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. ఆ డబ్బులు అనేవి ఇవ్వకుంటే చనిపోతానని మహిళను బెదిరించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె అవసరం ఏమోనని తొలిసారి రూ.25 వేలు డబ్బును అతని ఖాతాకు పంపించింది. ఇంకా కావాలంటే దశలవారీగా ఆరు నెలలో రూ.7.50 లక్షలు పంపించింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని ఆమె అతడిపై ఒత్తిడి తేవడంతో వసంత్ మొబైల్‌ను స్వీచ్ ఆఫ్ చేసేశాడు. చివరి ఆమె చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.