మంచిర్యాల జిల్లాలో భార్యాభర్తలను కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. వారం రోజుల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో బెల్లంపల్లి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భార్యాభర్తలకు కొవిడ్.. భార్య ఆత్మహత్య, భర్త మృతి! - తెలంగాణ వార్తలు
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. వైరస్ కాటుకు భార్యాభర్తలు బలయ్యారు. కొవిడ్ సోకడాన్ని తట్టుకోలేక భార్య... చికిత్స పొందుతూ భర్త మృతి చెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనాతో భార్యాభర్తలు మృతి, కొవిడ్‌తో దంపతులు మృతి
పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు తనకూ వైరస్ సోకడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ నెల 5వ తేదీన వైరస్ నిర్ధరణ కావడంతో ఆమె భర్తను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో ఆ దంపతులు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
ఇదీ చదవండి:టీకా పంపిణీలో అమెరికా రికార్డు