ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నస్పూర్లో నిర్మిస్తున్న తెరాస మంచిర్యాల జిల్లా నూతన కార్యాలయ భవన నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి... ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరిశీలించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే వేగంగా మంచిర్యాల జిల్లా తెరాస కార్యాలయం తుది దశకు చేరుకుందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని ఆయన కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్న కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు.
నూత తెరాస జిల్లా కార్యాలయం పరిశీలన - ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పర్యటన
మంచిర్యాల జిల్లా నస్పూర్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి పరిశీలించారు.
తెరాస జిల్లా కార్యాలయ నిర్మాణం పరిశీలన