Attack on Muncipal staff: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలికలో ఆక్రమణలు తొలగిస్తుండగా దుకాణదారుడు మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలో కాంటా చౌరస్తాకు వెళ్లిన అధికారులు దుకాణాల ఎదుట వేసిన ఆక్రమణలను జేసీబీతో తొలగిస్తుండగా ఈ దాడి జరిగింది. మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఓ దుకాణ యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని సోదరుడు ముబిన్ ఖాన్ అసభ్య పదజాలంతో దూషిస్తూ అసిస్టెంట్ కుమారస్వామిపై చేయి చేసుకున్నాడు.
మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మోబిన్ ఖాన్‌పై అధికారులు ఫిర్యాదు చేశారు. కుమారస్వామిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.