తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పెళ్లికి వారే ప్రత్యేక ఆహ్వానితులు... వినూత్నంగా పెళ్లి పత్రిక - telugu news

ఆ పెళ్లికి వారే ఆగమనాభిలాషులు. ఒకరు వ్యవసాయ క్షేత్రంలో స్వేదం చిందించి సేద్యం చేసే వారైతే... రక్తం చిందించి కాపుకాసేవారు ఇంకొకరు. పెళ్లి వేడుకలో ఎంతో కీలకమైన వివాహ ఆహ్వాన పత్రికపై జవాను, రైతు చిత్రాలను ముద్రించి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది ఓ కుటుంబం. ఆ విశేషాలేమిటో మీరు చూడండి.

ఆ పెళ్లికి వారే ప్రత్యేక ఆహ్వానితులు... వినూత్నంగా పెళ్లి పత్రిక
ఆ పెళ్లికి వారే ప్రత్యేక ఆహ్వానితులు... వినూత్నంగా పెళ్లి పత్రిక

By

Published : Dec 16, 2020, 8:35 PM IST

Updated : Dec 16, 2020, 8:48 PM IST

అభిమాన తారలకోసం గుడిని కట్టించినవారి గురించి వినుంటాం... మెచ్చిన నాయకుడికి జై కొట్టిన వారిని చూసుంటాం... వారి అభిమానాన్ని వాట్సప్​ స్టేటస్​లలోను... బహిరంగ సభలవద్ద, సినిమా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీల్లోను ప్రదర్శిస్తూనే ఉంటారు. రీల్​ నాయకులకు, రాజకీయ నాయకులకే కాదు... రియల్​ హీరోస్​కు కూడా అభిమానులుంటారు. మనసులోని అభిమానానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడో యువకుడు. ఇంతకీ ఆ యువకుడు చేసిందేమిటి... ఆ రియల్​ హీరోస్​ ఎవరు అనుకుంటున్నరా..? అయితే పన్నాల వారి పెళ్లికి వెళ్లాల్సిందే.

మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన పన్నాల భూమన్న, లక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడు సంతోష్​కుమార్​ వివాహం డిసెంబర్​ 18న జరగనుంది. వ్యవసాయాధారమైన ఆ కుటుంబం సాగుపై ప్రేమను, జవానులపై అభిమానాన్ని బంధుమిత్రులతో వినూత్నంగా పంచుకోవాలనుకున్నారు. అందుకు గాను పెళ్లిపత్రికపై... తుపాకితో పహారా కాస్తున్న జవాను, నాగలితో సాగు చేస్తున్న అన్నదాత చిత్రాలను ముద్రించారు.

శుభలేఖ చూసిన వారంతా కాబోయే వియ్యంకుల వారి గురించి కంటే.. ఈ చిత్రాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అడుగుతున్నారు. మనసున్న అభిమానాన్ని పెళ్లివేడుకలో భాగం చేసి.. శుభలేఖపై అచ్చువేసి.. అందరినీ ఆహ్వానిస్తున్నారు పన్నాల వారు.

ఇదీ చూడండి:పెళ్లి పత్రికపై మోదీ ఫోటో.. మరీ ఇంత అభిమానమా..

Last Updated : Dec 16, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details