మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. జట్లు నువ్వా... నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాల బాలికల జట్లు ఉత్సాహంగా పోటీలో పాల్గొని సత్తా చాటుతున్నాయి.
రేపటితో ముగింపు
క్రీడాకారులకు చక్కగా రాణిస్తున్నారని సీఐ మహేశ్ అన్నారు. వారి అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు రేపటితో ముగియనున్నాయి.
రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్ పోటీలు ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు