మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ఏ చట్టం ప్రకారం ప్రైవేటీకరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా కల్వకుంట్ల కుటుంబమే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ స్వరూప పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: వివేక్ - gandhi sankalpa yathra in bellampally
ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కారణమవుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: వివేక్
కేసీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: వివేక్