మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి ప్రవాస భారతీయుడు గుండా అమరనాథ్ రూ. 20 లక్షల విలువైన అంబులెన్స్, రూ. 5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.
ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్ఆర్ఐ సేవలు.! - ambulance and mineral water plant in lakshettipet
పుట్టిన ఊరుకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్, మినరల్ వాటర్ ప్లాంట్ను అందించారు ఎన్ఆర్ఐ గుండా అమర్నాథ్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో వీటిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.
లక్షెట్టిపేట కొత్తూరు గ్రామానికి చెందిన గుండా అమర్నాథ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తను పుట్టి పెరిగిన గ్రామానికి ఏదైనా చేయాలనే సామాజిక స్పృహతో.. గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని భావించారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ సహకారంతో రూ. 5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రభుత్వాస్పత్రికి రోగుల సౌకర్యార్థం రూ. 20 లక్షల అంబులెన్స్, మరో 5 లక్షలతో ఇతర మిషనరీని అందించారు. ఇదే స్ఫూర్తితో సొంత గ్రామాలకు సాయం చేయాలని భావిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి:నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్