మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు రావడం వల్ల వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా ప్రజలు నిత్యావసరాలు కొనుక్కునేందుకు ఎగబడుతున్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్.. కూరగాయల ధరలపై ప్రభావం - vegetables prices increased in bellampalli
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. కరోనా ప్రభావం వల్ల నెలాఖరు వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించినందున నిత్యావసరాల కోసం వేకువ జాము నుంచే ప్రజలు మార్కెట్ బాట పట్టారు. దొరికినవి కొనుక్కుని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్... కూరగాయల ధరలపై ప్రభావం
కూరగాయల ధరలు చూసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.40 ఉండాల్సిన పచ్చిమిర్చి ధర రూ.120 రుపాయలకు చేరగా.. టమాట రూ.20కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల రవాణా సౌకర్యం నిలిచిపోయినందున ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు