మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. సుద్దాల , సుబ్బరాంపల్లి, అక్కపెళ్లి, గంగారం గ్రామాల్లో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెన్నూరు మండలంలో ఉప్పొంగుతున్న వాగులు