calf born with five legs : ఐదు కాళ్లతో లేగ దూడ జననం - ఐదుకాళ్లతో ఆవు దూడ జననం
calf born with five legs : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో ఆవుకు వింత దూడ జన్మించింది. గ్రామానికి చెందిన కొండగుర్ల సమ్మయ్య ఇంట్లోని ఆవుకు ఐదు కాళ్లతో లేగ దూడ పుట్టింది. దూడకు వెనక రెండు కాళ్ల మధ్యలో మరొక కాలు ఉంది. వింత దూడ జననం గురించి తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు వస్తున్నారు. జన్యుపరమైన లోపాలతో ఇలాంటి దూడలు పుడతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
calf born with five legs
.