మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్మికులు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అంగీకార పత్రాలతో డిపోలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదని డిపో మేనేజర్ మల్లేశం తేల్చి చెప్పారు. ఏం చేయాలో పాలుపోని కార్మికులు అక్కడే చాలా సేపు ఉన్నారు. ఏం చేయలేక కార్మికులు వెనుతిరిగారు. డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ఆర్టీసీ యాజమాన్యం యథాతథంగా బస్సులను నడిపిస్తున్నారు.
'విధుల్లో చేర్చుకోవడం కుదరదు'
ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు ఈ రోజు వేకువజాము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు మంచిర్యాల డిపో వద్దకు చేరుకున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కుదరదని డిపో మేనేజర్ తేల్చిచెప్పారు.
'విధుల్లో చేర్చుకోవడం కుదరదు'